Israel: స్థానికంగానే భారీ బాంబుల తయారీ.... 21 h ago
ఇజ్రాయెల్ , అమెరికా సరఫరా చేసే బాంబు లపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ రక్షణశాఖ ఎల్బిట్ సిస్టమ్స్‌తో కలిసి రెండు ఒప్పందాలను కుదుర్చుకుంది. వాటి ద్వారా స్థానికంగానే భారీ బాంబులను తయారు చేయడానికి నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఎల్బిట్ సంస్థ ఇజ్రాయెల్ వాయుసేనకు వేల కొద్దీ భారీ బాంబులను సరఫరా చేయనుంది. అమెరికా నుంచి ఆయుధ సరఫరాలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా గుర్తించారు.